'పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్‌ – "ఎవరైనా చెప్పండి ప్లీజ్..!

పవన్ కళ్యాణ్ భాష వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఘాటు కౌంటర్ – హిందీ రుద్దకండి అని చెప్పడం భాష ద్వేషం కాదని మండిపాటు.;

Update: 2025-03-15 04:46 GMT
పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్‌ – "ఎవరైనా చెప్పండి ప్లీజ్..!
  • whatsapp icon

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో జరుగుతున్న భాషా వివాదంపై స్పందించారు. భాష, సంస్కృతిపై కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, హిందీ రుద్దుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయని చెప్పారు. ‘‘అన్నీ దేశ భాషలే. తమిళనాడులో హిందీకి వ్యతిరేకత ఉంటే, తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి. హిందీ భాషను అంగీకరించకపోతే, హిందీ ప్రేక్షకుల డబ్బులు ఎందుకు కావాలి? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. బహుభాషా సంస్కృతే దేశానికి మంచిది’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం, ఇంకో భాషను ద్వేషించడం కాదు. ఇది స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమే. ఎవ్వరైనా పవన్ కళ్యాణ్ గారికి ఇది చెప్పండి ప్లీజ్‌’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.



Tags:    

Similar News