పిన్నెల్లి పరారీకి పోలీసులే కారణం : ప్రత్తిపాటి ఫైర్
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారవ్వడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారవ్వడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పోలీసుల అసమర్థతకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. నిందితుల వెంటనే పోలీసులు ఉంటూ వారికి మద్దతివ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. నిందితులకే పోలీసులు హహారా కాస్తారా? అని నిలదీశారు.
నిందితులకు పహారాగా...
వివేకానందరెడ్డి హత్య కేసులోనూ నిందితుడు అవినాష్ రెడ్డిని ఇలాగే పోలీసులు కాపాడిన విషయాన్ని ప్రత్తిపాటి పుల్లారావు గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశించినా పోలీసుల ఉదాసీనత కారణంగానే తప్పించుకుని పారిపోయారన్నారు. ఎన్నికల కమిషన్ అందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐని రంగంలోకి దించి పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.