తిరుమలలో అవినీతిపై రమణదీక్షితుల ట్వీట్
తిరుమలలో అవినీతి ఎక్కువవుతుందని ఆలయ అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు
తిరుమలలో అవినీతి ఎక్కువవుతుందని ఆలయ అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. ముఖ్యమంత్రి జగన్ ను కూడా ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వంశపారపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారని అనుకున్నామని, ఈ విషయంపై ముఖ్యమం్తరి ప్రకటన చేయకపోవడం అర్చకులను నిరాశపర్చిందని ఆయన ట్వీట్ చేశారు.
ఒకసారి డిలీట్ చేసి...
తిరుమలలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయని, ఆలయ విధానాలతో పాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత రమణదీక్షితులు ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. అప్పటికే ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు స్క్రీన్ షాట్ లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే రమణ దీక్షితులు శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపారపర్యంగా సేవలు చేస్తున్నాయని, 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారన్నారు. ప్రస్తుతం తిరుమలలో అవినీతి రాజ్యమేలుతుందని ఆయన మళ్లీ ట్వీట్ చేశారు.