Tirumala : తిరుమలలో కొద్దిగా రద్దీ.. దర్శనం సులువే సుమా
తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఆదివారమయినా భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఆదివారమయినా భక్తుల రద్దీ అంతగా లేదు. పెద్దగా వేచి ఉండకుండానే శ్రీవారిని భక్తులు దర్శనం చేసుకునే పరిస్థితి నేడు తిరుమలలో ఉంది. కార్తీక మాసం కావడం, వరసగా దీపావళి సెలవులు రావడంతో అత్యధిక శాతం మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. అయితే శనివారం రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఆదివారం భక్తుల రద్దీ అంతగా లేదు. స్వామి వారిని భక్తులు సులభంగానే దర్శనం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మళ్లీ తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుందని, కార్తీక సోమవారం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలలో నూతన పాలకమండలి ఏర్పాటు కావడంతో సామాన్య భక్తులకు దర్శనం సులువుగా అయ్యేలా అనేక చర్యలు చేపట్టింది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తిరుమలలో భక్తులకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.