ఆల్ టైం రికార్డుకు చికెన్ ధర.. కిలో రూ.700

విజయవాడలో చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో చికెన్ ధర రూ.350కి చేరగా, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.700కి..

Update: 2023-06-10 06:52 GMT

chicken price hikes in ap and telangana

చికెన్ ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. రూ.150 ఉండే కిలో చికెన్ ధర కొద్దిరోజులుగా పెరుగుతూ రూ.300కి చేరింది. తాజాగా మరోసారి చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బాయిలర్ చికెన్ ధరలు కొండెక్కాయి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కోళ్లు చనిపోవడం, వాటి మేతకు అయ్యే ఖర్చు కూడా పెరగడంతో.. చికెన్ ధరలు పెరిగాయని విక్రయదారులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.350కి పెరిగింది.

విజయవాడలో చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో చికెన్ ధర రూ.350కి చేరగా, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.700కి పెరిగింది. కోళ్లఫారంలోనే లైవ్ బర్డ్ కిలో రూ.166 పలుకుతోంది. ఆదిలాబాద్, హైదరాబాద్‌ లలో కిలో చికెన్ ధర రూ.300 దాటింది. ఆదివారం వస్తుందంటే చాలు.. ముక్క ఉండాల్సిందే. పైగా ఫంక్షన్లు, పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో చికెన్ కు డిమాండ్ పెరిగింది. గడిచిన 20 రోజులుగా చికెన్ ధర అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వేసవి కారణంగా ఫారాలు కోళ్ల పెంపకాన్ని భారీగా తగ్గించాయి. దాని ప్రభావం ధరలపై పడుతోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రేపటికి (జూన్11) ఈ ధరలు మరింత పెరగవచ్చని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.



Tags:    

Similar News