Tirumala : బుధవారం తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ.. రీజన్ ఇదే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2024-08-14 03:24 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సంఖ్య బుధవారానికి పెరగడానికి వరస సెలవులు రావడమే కారణమని చెబుతున్నారు. ఈరోజు ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే వరసగా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అధికారులు ముందుగానే అంచనా వేశారు. వరస సెలవులతో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాలు అందరికీ దొరికేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,246 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,133 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News