చంద్రబాబు పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారి

అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత కేంద్రాన్ని సంప్రదించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Update: 2023-02-09 12:49 GMT

అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలు ఎందుకు వస్తాయన్నారు. నేతలను, క్యాడర్ ను నిలబెట్టుకునేందుకే చంద్రబాబు అవస్థలు పడుతున్నారన్నారు. లోకేష్ పాదయాత్రలో పది మంది కనపడాలంటే ముందస్తు ఎన్నికలని ప్రచారం చేయక తప్పదన్నారు.

లోకేష్ పాదయాత్రకు...
చంద్రబాబు హయాంలోనే ఫోన్ల ట్యాపింగ్ జరిగేవన్నారు. తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామన్నారు. న్యాయపరంగా, ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ముందుకు వెళతామని చెప్పారు. లోకేష్ పాదయాత్రకు జనంలో స్పందన లేదన్నారు. వికేంద్రీకరణ తథ్యమన్నారు. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.


Tags:    

Similar News