Pension : పెన్షన్ ఏడుగురి ప్రాణం తీసింది

పింఛన్లను తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన ఏడుగురు వృద్ధులు మరణించారు.

Update: 2024-05-04 01:53 GMT

పింఛన్లను తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన ఏడుగురు వృద్ధులు మరణించారు. ఎండల తీవ్రతకు వృద్ధులు మరణించారని స్థానికులు తెలిపారు. పింఛన్లను ఈ నెల ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంకు అకౌంట్ లో వేసింది. వీటిని తీసుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అందుతున్న సమచారం ప్రకారం ఏడుగురు వృద్ధులు మరణించినట్లు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చిల్లేవారి పాలేనికి చెందని తాయారు పింఛను తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

బ్యాంకులకు వెళ్లి...
ఏలూరు జిల్లాలోని పోలవరం పంచాయతీ పరిధిలోని బాపూజీకాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ కూడా పింఛను కోసం బ్యాంకుకు వెళ్లి ఎండలో నడక మార్గాన ఇంటికి చేరుకోవడంతో వడదెబ్బ తగిలి మరణించిందని చెబుతున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో చాగంటి సుబ్బాయమ్య, పొన్నూరు నగరానికి చెందిన గూడవల్లి ఏసు, తిరుపతి జిల్లాలోని జంబుకేశవపురానికి చెందిన నాగయ్య గురువారం పింఛను తీసుకునేందుకు వెళ్లి అస్వస్థతకు గురయి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కడప జిల్లాలో బద్వేలులో ఇద్దరు మరణించారని తెలిపారు.


Tags:    

Similar News