Supreme Court : నేడు కీలక తీర్పు.. చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెెవలెప్ మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు రానుంది.

Update: 2024-01-16 01:39 GMT

 telugu desam party chief chandrababu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెెవలెప్ మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు రానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిన్ అనిరుధ్, బేలా త్రేవేది ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించనుంది. తీర్పు ఏ విధంగా వస్తుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఎ కింద గవర్నర్ నుంచి అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అనుమతి లేకుండా...
గవర్నర్ అనుమతి లేకుండానే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు వేసిన పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఈరోజు వెలువడనుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసు కు సంబంధించి తీర్పు వెలువడేంత వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News