Jc Prabhakar Reddy : పేర్నినానికి ఫ్లెక్సీతో కౌంటర్ ఇచ్చిన జేసీ
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి పేర్నినానికి కౌంటర్ ఇచ్చారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి పేర్నినానికి కౌంటర్ ఇచ్చారు. మాటలతో కాదు.. ఫ్లెక్సీలతోనే. నిన్న పేర్ని నాని తన కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని, తన భార్యను రేషన్ బియ్యం కేసులో ఇరికించారంటూ ఆయన అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టారని అన్నారు. అయితే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
మాకు మాత్రం...
పేర్ని నానికి మాత్రమే కుటుంబం ఉందా? తమకు లేదా? తమకు పిల్లలు లేరా? నాడు తనను అరెస్ట్ చేసినప్పుడు నా కుటుంబం ఎంత ఆవేదన చెందిందంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలో పేర్ని నానినిన ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ తాడిపత్రిలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. దీనికి మరి పేర్ని నాని ఏం సమాధానం చెబుతారో? నాడు రవాణా శాఖ మంత్రిగా ఉన్న పేర్ని నాని తనపై అక్రమ కేసులు నమోదు చేయించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now