నా జీవితంలో ఎప్పుడూ జైలు గడప తొక్కలేదు
ముఖ్యమంత్రి జగన్ నేర చరిత్రపై పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ నేర చరిత్రపై పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన అక్కడ ప్రజల నుద్దేశించి మాట్లాడారు. తాము కేసులకు భయపడే ప్రసక్తి లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు తమనేవీ చేయలేవని ఆయన అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ జైలుకు వెళ్లి పరామర్శించలేదన్నారు. అయినా ఈరోజు జైలుకు వెళ్లి నేతలను పరామర్శించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తున్న పోలీసులను తాము వదలి పెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు.
అక్రమ కేసులు పెడుతూ...
కుప్పంలో అన్నా క్యాంటిన్ పెడుతుంటే అడ్డుకుంది వైసీపీ కార్యకర్తలని, తిరిగి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారని చంద్రబాబు అన్నారు. పోలీసు వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు పోలీసులు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం సంపద సృష్టిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విధ్వంసం సృష్టిస్తుందన్నారు. పది శాతం మంది పోలీసులతోనే తమకు సమస్య అని ఆయన అన్నారు. ప్రజా సమస్యల కోసం టీడీపీ నిత్యం పోరాడుతుందని చంద్రబాబు అన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే పోలీసు అధికారులను వదిలిపెట్టబోమని ఆయన వార్నింగ్ ఇచ్చారు.