ఎనిమిది గ్రామాలకు చంద్రబాబు.. భరోసా నింపేందుకు

కందుకూరులో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు

Update: 2022-12-29 06:54 GMT

కందుకూరులో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చెబుతున్నారు. అత్యవసర సాయం కింద వెంటనే 1.50 లక్షల సాయాన్ని చంద్రబాబు స్వయంగా మృతుల కుటుంబాలకు అందచేస్తున్నారు. నిన్న రాత్రి కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.

కార్యక్రమాలను రద్దు చేసుకుని...
అయితే ఈరోజు తన కార్యక్రమాలను రద్దు చేసుకుని కందుకూరు నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చి భరోసా ఇవ్వాలని భావించారు. అందులో భాగంగా చంద్రబాబు ఓగూరు వెళ్లి చనిపోయిన మధు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.


Tags:    

Similar News