Tirumala : తిరుమలలో తక్కువగానే భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీరామనవమి కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రాలేదు.
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీరామనవమి కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రాలేదు. దీంతో కంపార్ట్‌మెంట్లలో నాలుగు మాత్రమే భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,294 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,765 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.
నేడు శ్రీరామనవమి సందర్భంగా...
నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.94 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీరామనవమి సందర్భంగా నేడు తిరుమలలో ఆస్థానం జరగనుంది. హనుమంత వాహనంపై మాడవీధుల్లో శ్రీవారు విహరించను్నారు రేపు శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది.