నేడు తిరుమలకు మూడు లక్షల మంది పైగానే?

గరుడ సేవకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఇందుకోసం తిరుమల, తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది

Update: 2022-10-01 02:40 GMT

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు గరుడ సేవ జరగనుంది. ఈ గరుడ సేవకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఇందుకోసం తిరుమల, తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. నిన్న రాత్రి 12 గంటల నుంచే కొండ పైకి ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించింది. మూడు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలను అందించాలని నిర్ణయించింది. రాత్రి ఒంటి గంట వరకూ అన్న ప్రసాద భవనంలో భోజనం భక్తులకు అందజేయనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు ఎంతో విశిష్టత ఉంది. ఈ సేవలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

అన్ని ఏర్పాట్లు....
కరోనాతో రెండేళ్లు భక్తులకు అనుమతివ్వకపోవడం, ఈసారి భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో ఖచ్చితంగా భక్తులు ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో హాజరవుతారని అంచనా టీటీడీ వేస్తుంది. స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసింది. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలను ఎక్కడికక్కడ కల్పించింది. పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తిరుమలలోని అన్ని ప్రాంతాలను క్లీన్ చేస్తూ ఉండాలని ఆదేశాలు అందాయి. భక్తుల తప్పి పోతే వారి కోసం బంధువులు ఆందోళన చెందకుండా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసింది. కామన్ కమాండ్ సెంటర్ ను కూడా నెలకొల్పింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.


Tags:    

Similar News