Vijayawada : రేపు విజయవాడలో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ పర్యటన ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు;

Update: 2023-11-10 12:29 GMT
traffic restrictions, tomorrow, visit, vijayawada, ys jagan
  • whatsapp icon

రేపు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి రానున్నారు. అక్కడి నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు.

ట్రాఫిక్ ఆంక్షలు...
అక్కడ మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషనల్ డే సందర్భంగా జరపునున్న ఉత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. తిరిగి కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.


Tags:    

Similar News