నేటి అర్థరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనం

ఈరోజు అర్ధరాత్రి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2023-01-01 02:38 GMT

ఈరోజు అర్ధరాత్రి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. సోమవారం ఏకాదశి కావడంతో కైంకర్యాల అనంతరం ఈరోజు రాత్రి 1.45 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని వైకుంఠం ద్వారా కల్పించనున్నారు. 11వ తేదీ వరకూ ఆ ద్వారాలు తెరిచే ఉంటాయి. గత ఏడాది తరహాలోనే వైకుంఠ ద్వార దర్శనాలను పది రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రత్యేక కౌంటర్ల ద్వారా...
ఇందుకోసం ప్రత్యేకంగా భక్తులకు టిక్కెట్లను కేటాయిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకూ ఈ టిక్కెట్లను వివిధ కౌంటర్ల ద్వారా టీటీడీ భక్తులకు అందుబాటులోకి తేనుంది. ఈరోజు సర్వదర్శనం టోకెన్ల జారీని అధికారులు నిలుపుదల చేశారు. ఆధార్ కార్డును చూపించి ఎవరైనా ఈ టిక్కెట్ ను పొందే వీలు కల్పించింది. వీఐపీలు ఎవరూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిఫార్సు లేఖలు ఇవ్వవద్దని టీటీడీ కోరింది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News