9 మంది జనసైనికులు జైలుకు
విశాఖ జనసేన కార్యకర్తలను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు ప్రవేశ పెట్టారు. 9 మందిని జైలుకు తరలించారు
విశాఖ జనసేన కార్యకర్తలను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు ప్రవేశ పెట్టారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన దాడి కేసులో 62 మందికి సొంత పూచీకత్తుపై బెయిల్ లభించింది. 9 మందిని మాత్రం ఈ నెల 28వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. ఈ 9 మందిపై కూడా 307 సెక్షన్ నుంచి 326 సెక్షన్ గా మార్చారు. దీంతో వీరిని జైలుకు తరలించారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి, పోలీసుల విధులకు ఆటంకం కల్గించారన్న కేసులో చాలా మందికి ఊరట లభించడం విశేషం.
నోవాటెల్ లోనే...
అయితే పవన్ కల్యాణ‌్ ఇంకా నోవాటెల్ లోనే బస చేసి ఉన్నారు. సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పవన్ హోటల్ కే పరిమితమయ్యారు. ఆయన మధ్యాహ్నం 1 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరే అవకాశముంది. దీంతో పోలీసులు నోవాటెల్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.