క్రాస్ఓటింగ్ పాల్పడిన వారిని గుర్తించాం : సజ్జల
వైసీపీ ఎమ్మెల్సీ ఓటమి పాలు కావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు
వైసీపీ ఎమ్మెల్సీ ఓటమి పాలు కావడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. తాము ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాము లెక్కలోకి తీసుకోలేదన్నారు. అయితే తమది రాజకీయ పార్టీ అని, వారిపై ఏం చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో విప్ అనేది చెల్లదని అన్నారు.
బాబువి కుటిల రాజకీయాలు...
చంద్రబాబు కుటిల రాజకీయాలు అందరికీ తెలుసునని, ఈ ఫలితాలు సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూపవని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము బలం చూసుకుని ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టామని, చంద్రబాబు ఏం చూసి అభ్యర్థిని నిలబెట్టారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబువి పగటి కలలే అని అన్నారు. ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో తమకు తెలుసునని, సరైన సమయంలో చర్యలుంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇది రాజకీయం అని, ఉద్యోగం కాదు పీకేయడానికని ఆయన వ్యాఖ్యానించారు