విజయసాయిరెడ్డి ఇంటికి వైసీపీ దూత
ఢిల్లీలోని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి వైసీపీ అధినాయకత్వం దూతను పంపింది;

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి వైసీపీ అధినాయకత్వం దూతను పంపింది. కొద్దిసేపట్లో ఆయన తన రాజీనామా లేఖను వైస్ ఛైర్మన్ జగదీప్ థన్ ఖడ్ కు సమర్పించనుండటంతో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి విజయసాయిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలోనే విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన నివాసానికి వెళ్లిన గురుమూర్తి ఆయనతో చర్చిస్తున్నారు.
రాజీనామాలకు గల కారణాలు...
విజయసాయిరెడ్డి రాజీనామాలకు కారణాలు తెలియదని, ఆయన బెదిరింపులకు లొంగే వ్యక్తి కాదని గురుమూర్తి అన్నారు. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కనుగొనేందుకు తాను వచ్చానని గురుమూర్తి తెలిపారు. పార్టీలో కొనసాగాలని విజయసాయిని కోరారని, జగన్ ను మళ్లీ గెలిపించడానికి కృషి చేయాలని తాను కోరినట్లు గురుమూర్తి తెలిపారు. అయితే పార్టీలో ఎలాంటి సమస్య ఆయనకు లేదని గురుమూర్తి తెలిపారు.