వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులు.. అన్నాచెల్లెళ్లు వేర్వేరుగానే

ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు.విజయమ్మ కూడా హాజరయ్యారు

Update: 2024-07-08 02:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్‌ 75వ జయంతి వేడుకలు నేడు జరగనున్నాయి. ఇడుపులపాలయలో వైఎస్సార్ ఘాట్‌ వద్ద వైసీపీ జగన్ నివాళులు అర్పించారు వైఎస్ జగన్‌, షర్మిల కూడా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్ జగన్ ఘాట్‌ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కడప ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా పదిన్నర గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తర్వాత వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ నివాళులర్పించి వెళ్లిన తర్వాత ఎనిమిదిన్నర గంటలకు వైఎస్ షర్మిల వైఎస్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించనున్నారు వైఎస్ఆర్ ఆమెతో పాటూ తల్లి విజయమ్మ కూడా వైఎస్ఆర్ ఘాట్‎కు చేరుకుని నివాళులు అర్పిస్తారని సమాచారం. గత కొన్ని ఏళ్ల నుంచి అన్నా చెల్లెళ్ల మధ్య ఏర్పడిన విభేదాలతో విడివిడిగానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తల్లి విజయమ్మ మాత్రం ఇద్దరితో కలిసిి ఇడుపుల పాయకు వచ్చి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తూ వస్తున్నారు.


Tags:    

Similar News