Ys Jagan : వినుకొండకు చేరుకున్న జగన్.. పెద్దయెత్తున తరలి వచ్చిన కార్యకర్తలు
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ఇంటికి జగన్ చేరుకున్నారు. రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ఇంటికి జగన్ చేరుకున్నారు. రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. రషీద్ ప్రత్యర్ధి జరిపిన దాడిలో హతమయిన సంగతి తెలిసిందే. రషీద్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా జగన్ వారికి హామీ ఇచ్చారు. రషీద్ లేని లోటు కుటుంబానికి మాత్రమే కాదని, పార్టీకి కూడా తీరని లోటని అయితే దీనిపై న్యాయపరంగా పోరాటం చేద్దామని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా పార్టీ తరుపున చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెద్దయెత్తున కార్యకర్తలు...
వైఎస్ జగన్ వినుకొండకు వస్తున్నారని తెలిసి పల్నాడు ప్రాంతం నుంచి పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే 144 సెక్షన్ అమలులో ఉందని, వెళ్లిపోవాలని పోలీసులు అభ్యంతరం చెప్పినా జగన్ ను చూసేందుకు వందల సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు. అందరికీ అభివాదం చేసుకుంటూ జగన్ రషీద్ ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.