Breaking : స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు.. ఇరవై ఐదు నియోజకవర్గాల్లో
నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరిగింది.
నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరిగింది. గాజు గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థులను టెన్షన్ పెడుతుంది. మచిలీపట్నం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ గా గుర్తించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో నవతరం పార్టీ అభ్యర్థికి కూడా గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. ఇది కూటమి అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది.
ఎన్నికల సంఘానికి...
అయితే గాజు గ్లాస్ గుర్తును జనసేన పోటీ చేసే స్థానంలో కాకుండా మిగిలిన చోట్ల కేటాయించవద్దంటూ ఎన్నికల కమిషన్ కు జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. అయితే రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు కేటాయించడం ఇప్పుడు టెన్షన్ పెడుతుంది. రిటర్నింగ్ అధికారులను స్వతంత్ర అభ్యర్థులు తమకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా కోరడంతో వారికి ఆ గుర్తును కేటాయించినట్లు తెలిసింది.