Ap Elections : మెంటల్ ఎక్కిపోతుంది సామీ..ఓట్ల బదిలీపై టెన్షన్.. ఎందుకిలా అయిపోయింది బాబయ్యా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ జరిగి దాదాపు పక్షం రోజులవుతుంది. మరో ఆరు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి

Update: 2024-05-30 08:01 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ జరిగి దాదాపు పక్షం రోజులవుతుంది. మరో ఆరు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అంచనాలు మాత్రం ఎవరివి వాళ్లవే. ప్రధానంగా కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం పీక్ స్థాయిలో ఉంది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే పోలింగ్ జరిగిన తర్వాత కొత్త సందేహాలు మొదలయ్యాయి. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ పది స్థానాలు, మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. 144 స్థానాల్లో జనసేన, బీజేపీ ఓట్లు ఏ మేరకు టీడీపీకి బదిలీ అయ్యాయా? లేదా? అన్నది మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ ఇంజినీరింగ్ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. అభ్యర్థులను బట్టి కూడా ఓటర్లు చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారన్న వార్తలు అందుతున్నాయి.

Full Viewకాపు సామాజికవర్గం...
కూటమి గెలిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉపయోగం అని భావించిన కాపు సామాజికవర్గం నుంచి ప్రజలు మాత్రం ఎక్కువ శాతం జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు విశ్లేషణలు అందుతున్నాయి. అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి లేకపోతే మాత్రం అక్కడ ఓట్లు ట్రాన్స్‌ఫర్ కాలేదన్న వార్తలు కూడా కూటమి నేతలను కలవరపరుస్తున్నాయి. కూటమి గెలిచినా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేడని భావించి కొందరు కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ఆ నియోజకవర్గంలో వైసీపీ కాపు అభ్యర్థికి ఓట్లు వేసినట్లు కూడా పోలింగ్ అనంతరం వస్తున్న కథనాలు, విశ్లేషణలు కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి.
వాటితో పోల్చడం...
2014, 2019 ఎన్నికలు వేరు. 2024 ఎన్నికలు వేరు. 2014 ఎన్నికలలో ముగ్గురు కలసి పోటీ చేసి విజయం సాధించారు కదా? అదే కాంబోతో వచ్చినందున ఈసారి కూడా విజయం తధ్యమని భావించడం అంతకంటే పిచ్చి ఆలోచన మరొకటి ఉండదని చెబుతున్నారు. నాటి పరిస్థితులు వేరు. నేడు పరిస్థితులు వేరు. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, వైసీపీ విడివిడిగా పోటీ చేయడంతో వచ్చిన ఓట్లను కూడా ఇప్పుడు కలుపుకుని తమదే విజయం అని అనుకోవడానికి కూడా వీలులేదు. ఎందుకంటే...నాడు సంక్షేమ పథకాలు నేరుగా జనానికి అందలేదు. అలాగే వాలంటరీ వ్యవస్థ లేదు. అందుకే నాడు సామాజికవర్గాల వారీగా విడిపోయి నాడు ఓటు వేశారు. కానీ నేడు పరిస్థితిని చూస్తే మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. పోలింగ్ సరళిని చూసిన వారికి అంచనాలు అందని విధంగా ఉన్నాయి.
క్యాస్ట్ కంటే...
ీఈ ఎన్నికల్లో క్యాస్ట్ కంటే క్యాష్ అంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా పనిచేస్తే కులాలకతీతంగా జగన్ పక్షాన నిలిచే అవకాశముంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే మళ్లీ రాష్ట్రం బాగుపడుతుందని, ఆయనకు చివరి ఛాన్స్ ఇస్తే పోలా? అన్న ఆలోచన వస్తే మాత్రం అది కూటమికి అడ్వాంటేజీగా మారుతుంది. మరో విషయం ఏంటంటే.. చంద్రబాబు ఈసారి తాను ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాడని, అలాగే ఆయన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని నమ్మితే మాత్రం కూటమికి తిరుగుండదు. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్వల్ప మెజారిటీతోనే ఈసారి వస్తుందన్నది యదార్థం. ఏకపక్షంగా వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని భావించడమూ అంతే తప్పిదమన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏపీ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీనేతలను మాత్రం కుదరుగా కూర్చోనివ్వడం లేదు.


Tags:    

Similar News