Exit Polls : అధికారంలోకి వచ్చేది టీడీపీయే.. కొన్ని సంస్థల అంచనా ఇదే

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేశాయి

Update: 2024-06-01 15:37 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేశాయి. ఎన్ని సంస్థలు కూటమికి అనుకూలంగా చెప్పాయి అనే దానికన్నా వాటి కున్న క్రెడిబులిటీ మీద కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరు ఎలా చేసినా ఎగ్జిల్ పోల్స్ అన్నీ నిజం కాకపోవు. అలాగని అబద్దాలు అని అసలు ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే తెలియనుంది. దీంతో కూటమి పార్టీల్లో కూడా తాము ఈసారి అధికారంలోకి వస్తామని గట్టిగా నమ్ముతున్నారు.

ఈ వర్గాలన్నీ...
ప్రధానంగా పురుష ఓటర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ శాతం మంది కూటమి వైపు మొగ్గు చూపారన్నది వాస్తవం. అందులో అన్ని సంస్థలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఒకటి కారణంకాగా డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఎక్కువ మంది నమ్మి కూటమి వైపు మొగ్గు చూపుతారని తెలిపాయి. చంద్రబాబు వయసు, అనుభవానికి కూడా కొంత ప్రజలు గౌరవమిచ్చినట్లే ఈ సంస్థల సర్వేలను బట్టి అర్థమవుతుంది. అయితే జూన్ 4 వతేదీనే అసలైన ప్రజాతీర్పు వెలువడనుంది.

టీడీపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్ : టీడీపీ 95-110, జనసేన 14-20, బీజేపీ 2-5, వైసీపీ 45-60

ప్రిజమ్ : కూటమి 110, వైసీపీ 60 సీట్లు

చాణక్య స్ట్రాటజీస్ : కూటమి 114-125, వైసీపీ 39-49 సీట్లు

కేకే ఎగ్జిట్ పోల్స్‌ : కూటమి 161, వైసీపీ 14 సీట్లు

టీవీ9 : లోక్‍సభ : వైసీపీ-13, టీడీపీ-9, బీజేపీ-2, జనసేన-1

S-GED సర్వే : కూటమి 139, వైసీపీ 36 సీట్లు


Tags:    

Similar News