Gold Price Today : మహిళలకు తీపికబురు.. బంగారం ధరలు తగ్గాయోచ్

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిపాటి మార్పు కనిపించింది.

Update: 2024-12-13 04:08 GMT

బంగారం ధరలు నిత్యం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు పెరగడమే తపపించి తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో జరగడం లేదు. వరసగా ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతూ ఉన్నాయి. ధరలు పెరుగుతుండటం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తుంది. బంగారం ముట్టుకుంటేనే షాక్ తగిలేలా ఉంది. పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే గతంలో మాదిరి తాము వేసుకున్న అంచనాలు సరిపోవడం లేదు. అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి రావడంతో వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలుకు ఒకింత వెనకడుగువేస్తున్నారు. ఇంత పెద్దమొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడంపై సందిగ్దంలో ఉన్నారు.

అందుబాటులో లేక...
బంగారం, వెండి ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండటం లేదు. కొనుగోలు చేయాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉండటంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిందని వ్యాపారులు కూడా ఒకింత ఆందోళన చెందుతున్నారు. దీపావళి నుంచి ఈ పరిస్థితి కనపడుతుందని వారు చెబుతున్నారు. అయితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు ఇయర్ ఎండింగ్ సేల్స్ విపరీతంగా ఉంటాయని వ్యాపారులు అంచనా వేసి ఎక్కువ మొత్తంలో సరుకును తెప్పించినా కొనుగోలుకు ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం, వెండి ధరలు రానున్న కాలంలో మరింత పెరుగుతాయని, పెట్టుబడి దారులు ఇప్పుుడే కొనుగోలు చేయడం మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. రానున్న కాలంలో మరింతగా ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోతాయని చెబుతున్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిపాటి మార్పు కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,840 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,460 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,04,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News