Gold Rates Today : గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి

Update: 2024-12-14 03:43 GMT

బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో? ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. సాధారణంగా బంగారం ధరల్లో పెరుగుదల మాత్రమే కనిపిస్తుంది. తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అనేక కారణాలతో ధరల్లో మార్పు కనిపిస్తుంటుంది. అందులోనూ అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యంతో పాటు వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల కూడా బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ధరలు పెరిగినా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదన్నది వ్యాపారులు చెబుతున్న మాట.

రానున్న రోజుల్లో...
అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేయదలచుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. అదే సమయంలో బంగారం, వెండి ధరలు ఎప్పటికీ పతనం కావని, పెట్టుబడి పెట్టే వారికి కూడా లాభాలను తెచ్చిపెడతాయే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నష్టాలను తెచ్చి పెట్టవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే పెట్టుబడి దారులకు ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు. బంగారం ధరలు మరింత ప్రియమైతే ఇక కొనుగోలు చేయడం కూడా కష్టంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
భారీగా తగ్గిన ధరలు...
బంగారం, వెండి వస్తువలు రెండు ఎప్పటికప్పుడు పెరిగేవే. వాటి ధరలు ఏమాత్రం తగ్గవు. అందుకే బంగారం పై పెట్టుబడి సురక్షితమైనదని ఎవరైనా చెబుతారు. అందువల్లనే భారత్ లో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,870 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 93,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News