Gold Price Today : మహిళలకు మంచి కబురు.. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు బంగారం ధరలు మాత్రం దేశంలో స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మత్రం స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. వెండి ధరలు కూడా అంతే. ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ బంగారం కొనుగోలు చేయాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలకు గగనంగా మారిపోతుంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు ప్రకటన వెలువడిన తర్వాత బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం వేగంగా ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అదే సమయంలో కొనుగోళ్లపై కూడా ఈ ధరల పెరుగుదల ప్రభావం పడిందని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.
ఈ ఏడాది ధరలు పెరిగి...
అయితే బంగారం ధరలు 2024లో విపరీతంగా పెరిగాయి. అయితే వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలు తగ్గవచ్చన్నది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. పది గ్రాముల బంగారం ధర 80 వేల రూపాయలు దాటి అందరినీ భయపెట్టేసింది. అలాగే వెండి ధర కూడా లక్షకు మించి పలకడంతో ఎవరూ కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాలేదు. అయితే తాజా అంచనాల ప్రకారం బంగారం, వెండి ధరలు నూతన సంవత్సరంలో తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కొనుగోళ్లు తగ్గడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దీంతో పాటు అనేక కారణాలతో వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలు చాలా వరకూ దిగివస్తాయని అంచనా వేస్తున్నారు. అదే నిజమయితే అంతకు మించిన గుడ్ న్యూస్ మరొకటి ఉండదు.
ఈరోజు ధరలు...
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై 1,400 రూపాయలు తగ్గింది. అయితే ఈరోజు బంగారం ధరలు మాత్రం దేశంలో స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మత్రం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,400 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,890 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర లక్ష రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.