Gold Rates Today : బంగారం ధరలకు బ్రేకులు.. కొద్దిగా శాంతించిన వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది;

బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడం కొంత మందికి మాత్రమే కుదురుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతున్న కొద్దీ బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతుండటంతో కొన్ని వర్గాలకు అది దూరంగానే కనపడుతుంది. పెట్టుబడి పెట్టే వారు మినహాయించి బంగారాన్ని కొనుగోలు చేయాలంటే చాలా మంది వెనకాడుతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు బంగారం, వెండి కొనుగోలు చేయడం తమకు శక్తికి మించిన పనిగా భావిస్తుండటంతో కొనుగోళ్లు కూడా పెద్దగా జరగడం లేదు. జ్యుయలరీ దుకాణాలన్నీ ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆఫర్లు దుకాణాల యాజమాన్యం ప్రకటించినా అటు వైపు చూడటం లేదు.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయినా...
ప్రస్తుతం ఏప్రిల్ సీజన్ లో మరిన్ని పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమై కొన్ని నెలలు గడుస్తుంది. ఏప్రిల్ మాసంలో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వేలాది పెళ్లిళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుండటంతో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయని అందరూ అంచనా వేశారు. కానీ ముహూర్తాలు పెట్టుకున్నా బంగారం కొనుగోలుకు మాత్రం వినియోగదారులు ముందుకు రావడం లేదు. ఇప్పటికే బంగారం, వెండి ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే 90 వేల రూపాయలు దాటే సింది. కిలో వెండి ధర 1,11 లక్షలకు చేరుకుంది. దీంతో అమ్మకాలు గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా పడిపోయాయని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతోంది.
డిమాండ్ తగ్గని...
బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వాటికి గిరాకి అనేది తగ్గదు. ఎందుకంటే స్టేటస్ సింబల్ గానే బంగారాన్ని, వెండి చూడటం మొదలయిన నాటి నుంచి వీటి కొనుగోళ్లు కూడా ఎక్కువగా పెరిగాయి. అందుకే ధరలు పెరిగాయి. బంగారం దిగుమతులు తగ్గడం కూడా ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,210 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,11,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.