Gold Price Today : దడ పుట్టిస్తున్న పసిడి..ఇంతలా పెరిగి షాకిచ్చిందేంటి?
బంగారం ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే భయపెడుతున్నాయి.;

బంగారం ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతుండటంతో బంగారం ధరలు ఇప్పటికే ఆల్ టైం హైకి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే పసిడి పది గ్రాముల ధర 91 వేల రూపాయలను దాటేసింది. కిలో వెండి ధర లక్షా పదిహేను వేల రూపాయలకు ఎగబాకింది. దీంతో ఈ స్థాయిలో ధరలను పెట్టి కొనుగోలు చేయడం అనసవరమని భావించి అనేక మంది బంగారం, వెండి కొనుగోళ్లకు వెనక్కుతగ్గుతున్నారు.
వ్యాపారుల అంచనాలు తలకిందులు...
పెళ్లిళ్ల సీజన్ అయితే కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు వేసిన అంచనాలు మాత్రం చేరుకోవడం లేదు. ఎందుకంటే ఈస్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేయడం అనవసరమని భావించే పరిస్థితికి వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కూడా తమకు కావల్సినంత మేరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మహిళలు ముఖ్యంగా బంగారం, వెండి వస్తువుల కొనుగోలుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ గత నాలుగైదు నెలల నుంచి మహిళ కస్టమర్లు జ్యుయలరీ దుకాణాలకు రావడం లేదని, నగల డిజైన్లు చూసి కూడా టెంప్ట్ కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గ్రాము బంగారం కొనుగోలు చేయడం కూడా నేటి ధరలకు గగగనంగా మారిందని వినియోగదారులు అంటున్నారు.
ధరలు పెరిగి...
బంగారం అంటే సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొందరు దీనిపై ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఇలా పెరిగిన ధరలు మళ్లీ భారీగా పతనమవుతాయేమోనన్న భయంతో కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా నమోదయ్యాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 83,110 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,670 రూపాయలుగా నమోదయింద. కిలో వెండి ధర 1,15,200 రూపాయలుగా ఉంది.