కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదం.. బ్రిడ్జిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య
వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని చెరువులో నుండి వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసి..;

man suicide at durgam cheruvu cable bridge
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు ( మే 6) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వ్యక్తి బ్రిడ్జి పై నుండి దూకుతుండటాన్ని గమనించిన కొందరు వాహనదారులు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే అతను చెరువులోకి దూకేశాడు.
వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని చెరువులో నుండి వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఆ వ్యక్తి ఎవరు ? ఎక్కడి నుండి వచ్చాడు ? ఆత్మహత్యకు గల కారణాలేంటి ? అతని మానసిక పరిస్థితి సరిగానే ఉందా ? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.