బస్సులో మంటలు... నలుగురు ఉద్యోగుల సజీవదహనం
మహారాష్ట్రలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు;

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పూనేలో ఒక ప్రయివేటు కంపెనికి చెందిన బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న నలుగురు ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఎమెర్జెన్సీ గేట్ తెరుచుకోకపోవడంతో బస్సులోపల ఉన్న ఉద్యోగులు బయటకు రాలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పథ్నాలుగు మంది ఉద్యోగులు...
బస్సులో వ్యోమా గ్రాఫిక్ కంపెనీకి చెందిన పథ్నాలుగు మంది ఉద్యోగుల ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత డ్రైవర్ సీటు వద్ద మంటలు రాగానే వెంటనే బస్సును ఆపకపోవడంతో మంటల తీవ్రత పెరిగి బస్సు అంతటా అఅలుముకున్నాయి. దీంతో కంపెనీలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.