తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Update: 2024-05-31 04:32 GMT

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామ సమీపంలోని ఆలమూరు - మండపేట ఆర్.అండ్.బి రోడ్డుపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు ఏపీ 39 వీడి 0089 నెంబరు గల బొలెరో వాహనంలో తుంగపాడు చేపల వేటకు బయలుదేరారు. ఇదే సమయంలో మండపేట పౌరసరఫరాల గోదాముల నుండి బియ్యం తరలిస్తున్న ఏపీ 05 టి 1890 నెంబర్ గల ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా ఎదురుగా వస్తున్న మత్స్యకారుల వాహనాన్ని బలంగా ఢీకొనింది.

వాహనాలు ఢీకొని...
దీంతో వాహనం వెనుక బాగాన ఉన్న లంకే సూరిబాబు(49), వనమూడి సాయిబాబు(62) అనే ఇద్దరు వ్యక్తులకు బలమైన రక్తపు గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అదే వాహనంలో ప్రయాణిస్తున్న మిగిలిన మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారని మెరుగైన వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అలాగే శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానికుల సహకారంతో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సదరు విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags:    

Similar News