కప్ ఎవరిది ….?

ప్రపంచ కప్ ఎవరు ముద్దాడతారు ? ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ కోసం [more]

Update: 2019-07-14 00:30 GMT

ప్రపంచ కప్ ఎవరు ముద్దాడతారు ? ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ కోసం ఆతిధ్య ఇంగ్లాండ్, తన చిరకాల కోరిక నెరవేర్చుకునేందుకు న్యూజిలాండ్ అమీతుమీకి సిద్ధం అయ్యాయి. రెండు జట్లు 1975 లో మొదలైన ప్రపంచ కప్ సమరంలో ఇప్పటివరకు ఒక్కసారి కప్ ను గెల్చుకోలేకపోయాయి. దాంతో ఇటు కెన్ విలియమ్సన్, అటు మోర్గాన్ సేనలు తుది సమరానికి ముమ్మరంగా ప్రాక్టీస్ చేసి యుద్ధానికి సిద్ధం అయ్యాయి.

ఇది చరిత్ర ….

ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ చరిత్ర గమనిస్తే 1975,1979 ప్రపంచకప్ లను వెస్ట్ ఇండీస్ కైవసం చేసుకుంది. తొలి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా రెండో సారి ఇంగ్లాండ్ రన్నర్ అప్ గా నిలిచాయి. ఆ తరువాత 1983 లో ఇండియా తొలి వరల్డ్ కప్ సాధిస్తే రన్నర్ గా వెస్ట్ ఇండీస్ నిలిచింది. ఆ తరువాత 1987 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా అయితే ఇంగ్లాండ్ రన్నర్ గా 1992 ప్రపంచ కప్ విజేతగా పాకిస్తాన్ రన్నర్ గా ఇంగ్లాండ్ నిలిచాయి. 1996 వరల్డ్ కప్ ను శ్రీలంక సాధిస్తే రన్నర్ గా ఆస్ట్రేలియా నిలిచింది. 1999 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విన్నర్ అయితే పాకిస్తాన్ రన్నర్ గా వుంది. 2003 ప్రపంచకప్ విన్నర్ ఆస్ట్రేలియా అయితే రన్నర్ ఇండియా. 2007 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా సాధిస్తే రన్నర్ గా శ్రీలంక నిలిచింది. 2011 ప్రపంచ కప్ ను ఇండియా సాధిస్తే రన్నర్ గా శ్రీలంక నిలిచింది. 2015 ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలిస్తే రన్నర్ గా న్యూజిలాండ్ నిలిచింది. ఇప్పటివరకు 11 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలవగా వెస్ట్ ఇండీస్, భారత్ రెండేసి సార్లు కప్ ను అందుకున్నాయి. ఒకసారి పాకిస్తాన్ మరోసారి శ్రీలంక కప్ ను గెలిచాయి.

నాలుగోసారి ఫైనల్ లో …

ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ వరల్డ్ కప్ రికార్డ్ పరిశీలిస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే 2019 వరల్డ్ కప్ బరిలో నిలిచాయి. ఇప్పటివరకు ఇంగ్లాండ్ నాలుగు సార్లు ఫైనల్ కు చేరుకుంది. న్యూజిలాండ్ రెండోసారి చేరుకుంది. నలభైనాలుగు ఏళ్ళుగా ఇరు జట్లకు ఫైనల్స్ లో దురదృష్టం వెన్నాడుతుంది. ఆయా దేశాల క్రీడాభిమానులకు కప్ తీరని కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు రెండు జట్లలో ఏ ఒక్కరు కప్ అందుకున్నా నాలుగున్నర దశాబ్దాల చరిత్రను బద్దలు కొట్టేవారే అవుతారు.

వత్తిడిలో ఇంగ్లాండ్ …

స్వదేశంలో అన్ని విధాలా ఇంగ్లాండ్ కి అనుకూలతలు ఉన్నప్పటికి అదే స్థాయిలో వత్తిడి ఆ టీం పై ఉంటుంది. ప్రపంచకప్ లాంటి టోర్నీలలో సహజంగానే వత్తిడి అధికం. దానికి మించి స్వదేశంలో టోర్నీ కావడంతో మోర్గాన్ సేనపై మరింత ఇది ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం సమిష్టిగా రాణిస్తుంది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో జట్టులోని ఆటగాళ్ళు అంతా చక్కగా రాణిస్తున్నారు. దాంతో ఇప్పుడు కప్ గెలవకపోతే అన్న రీతిలో చెలరేగుతుంది ఇంగ్లిష్ టీం.

న్యూజిలాండ్ కి వారే అండ …

మరోపక్క బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ గా వుంది. అయితే బ్యాటింగ్ లో కెప్టెన్ విలియమ్సన్ , జోయ్ రూట్ లు మాత్రమే ఇప్పటివరకు టీం భారం మోస్తున్నారు. మిగిలిన బ్యాట్స్ మెన్ రాణిస్తే న్యూజిలాండ్ కి తిరుగులేదు. అదే ఇప్పుడు ఆ టీం ను వేధిస్తుంది. అయితే సెమిస్ లో అద్భుత ఆటతీరుతో టీం ఇండియా పై గెలిచిన స్ఫూర్తి తో ఫైనల్ లో విజయంపై కెన్ సేన గట్టి ధీమాతో వుంది. ఇంగ్లాండ్ ను ఆరంభంలోనే దెబ్బ కొట్టాలంటే టాప్ ఆర్డర్ కూలిస్తే సరిపోతుందన్న లెక్కల్లో వుంది. ఇది ఇలా ఉంటే ఫైనల్ లో కప్ అందుకునే హాట్ ఫెవరెట్ గా మాత్రం ఇంగ్లాండ్ అనే చెబుతున్నారు క్రీడా పండితులు. అయితే అంచనాలు తలక్రిందులు చేసే కెన్ టీం ఫైనల్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News