అంటీ ముట్టనట్లు ఎందుకో…?

అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమించారు. ఆయన తొలి నుంచి వైఎస్ జగన్ ను నమ్ముకున్నారు. పార్టీ కార్యక్రమాలను తూచ తప్పకుండా [more]

Update: 2019-07-30 11:00 GMT

అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమించారు. ఆయన తొలి నుంచి వైఎస్ జగన్ ను నమ్ముకున్నారు. పార్టీ కార్యక్రమాలను తూచ తప్పకుండా చేసిన అనంత వెంకట్రామిరెడ్డి గత ఐదేళ్లుగా ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఇందులో ఎవరూ కాదనలేరు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో సయితం పెద్దగా మాట్లాడటం లేదు.

కాంగ్రెస్ నేతగా….

అనంత వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక పర్యాయాలు అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచి అనంత వాణిని విన్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన మిత్రుడిగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన అనంతపురం జిల్లాలో వైసీపీకి కీలకనేతగా మారారు.

పార్టీకి నమ్మకంగా…..

2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఆయన పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో సక్సెస్ కావడానికి అనంత వెంకట్రామిరెడ్డి కారణమని చెప్పక తప్పదు. అయితే ఆయన వైసీపీ అధికారంలోకి వస్తే తాను ప్రభుత్వంలో కీలకంగా మారతానని భావించారు. మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించారు. కానీ జగన్ తొలి మంత్రివర్గంలో అనంత వెంకట్రామిరెడ్డికి స్థానం దక్కలేదు.

కనిపించకుండా…..

మంత్రి పదవి దక్కకపోవడంతో అనంత వెంకట్రామిరెడ్డి మానసికంగా కుంగిపోయినట్లు కన్పిస్తున్నారు. ఆయన అసెంబ్లీలో కన్పించడం మానేశారు. అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, ఉషాశ్రీ చరణ్,జొన్నల గడ్డ పద్మావతి వంటి వారు జిల్లా సమస్యలను ప్రస్తావిస్తున్నప్పటికీ అనంత వెంకట్రామిరెడ్డి మాత్రం అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. వచ్చే విస్తరణలోనైనా పదవి దక్కుతుందన్న ఆశ లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News