హైదరాబాద్ లో 5జీ ఎప్పటి నుండి అందుబాటులోకి రాబోతోందంటే..!
హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాలింగ్‌లను ఆస్వాదించడానికి 5G ఇంకా బాగా సహాయపడుతుంది.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో భారతదేశంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాల్లో 5G సేవలను మొదట తీసుకుని రానున్నారు.
ఇక హైదరాబాద్‌లో 5జీని ప్రారంభించడానికి దాదాపు రెండు వారాలు పడుతుందని టెలికాం కంపెనీ అధికారి తెలిపారు. హైదరాబాద్ లో పరీక్ష దశ పూర్తయిందని తెలిపారు. అయితే టారిఫ్‌లపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో 5జీ డేటా విషయంలో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. దీపావళి నాటికి 5Gని అందించడం ప్రారంభించే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు.
హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాలింగ్‌లను ఆస్వాదించడానికి 5G ఇంకా బాగా సహాయపడుతుంది. 5G వేగం 4G కంటే 7-10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 5G ఫోన్‌లలో మొదటిది 2019లో భారతదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు కొత్త హ్యాండ్ సెట్స్ చాలా వరకూ 5జీని సపోర్ట్ చేస్తున్నాయి. మీరు కొత్త హ్యాండ్‌సెట్‌ని కొనుగోలు చేయాలని అనుకుంటే.. ఇప్పటికే చాలా Android ఫోన్‌లు, iPhoneలు (iPhone 12 మరియు తదుపరి మోడల్‌లు) 5Gకి మద్దతు ఇస్తున్నాయి. ఇక తక్కువ ధరలో కూడా 5జీ మొబైల్స్ ను అందించాలని పలు సంస్థలు భావిస్తూ ఉన్నాయి.