మెట్రో రైళ్ల వేళల్లో మార్పు
హైదరాబాద్ లో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి నుంచి నాంపల్లి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 12 గంటల వరకూ మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసమే చివరి మెట్రో రైలు 12 గంటల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు.
ఎగ్జిబిషన్ దృష్ట్యా...
ఇప్పటి వరకూ 11 గంటల వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మరో గంట సేపు పొడిగిస్తూ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం నుంచి చివరి రైలు 12 గంటలకు ఉంటుందని, ఎగ్జిబిషన్ దృష్ట్యా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ లో అదనపు టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.