రేపటి నుంచి కూల్చివేత ప్రారంభం
ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభం కానున్నాయి
ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ ను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కూల్చివేతల ప్రక్రియను చేపట్టేందుకు హైదరాబాద్ కంపెనీ టెండర్ ను దక్కించుకుంది. 33 లక్షల రూపాయల టెండర్ తో కంపెనీ ముందుకు రావడంతో కూల్చివేత ప్రక్రియను ఆ కంపెనీకి అప్పగించారు. చుట్టుపక్కల నివాసాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుని కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. కూల్చివేతకు అధునాతన యంత్రాలను వినియోగించాలని అధికారులు కంపెనీనీ ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు...
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు గల్లంతయిన సంగతి తెలిసిందే. గల్లంతయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం ప్రమాదకరంగా మారడంతో దానిని కూల్చి వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం టెండర్ పిలవగా 33 లక్షలకు ఒక ంపెనీ దక్కించుకుంది. రేపటి నుంచి డక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభమవుతాయి.