హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
హైదరాబాద్ లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాండూస్ తుపాను ఎఫెక్ట్ తెలంగాణలోనూ కనిపించింది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం ఎనిమిది గంటలయినా సూర్యుడు కన్పించకపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తేలికపాటి వర్షాలు...
తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిని వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందని, దీని ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిన్నటి నుంచే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.