నాగోలు ఫ్లైఓవర్ నేడు ప్రారంభం
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ కు నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నాగోలు ఫ్లైఓవర్ ను నేడు ఆయన ప్రారంభిస్తారు.
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ కు నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నాగోలు ఫ్లైఓవర్ ను నేడు ఆయన ప్రారంభిస్తారు. ట్రాఫిక్ సమస్యలను చెక్ పెట్టేందుకు హైదరాబాద్ లో ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్ లను, అండర్ పాస్ లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 143 కోట్ల రూపాయల వ్యయంతో నాగోలు వద్ద ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ట్రాఫిక్ రద్దీని...
ఈ ఫ్లైఓవర్ కారణంగా ఉప్పల్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఎల్‌బినగర్ వరకూ వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. 990 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే వీలు కలుగుతుంది. ప్రజలు దీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. నేటితో ఆ సమస్య తీరనుంది. సిగ్నల్ ఫ్రీతో ఫ్లై ఓవర్ పై ప్రయాణించే వీలు కలుగుతుంది.