నేడు హైదరాబాద్‌కు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. రెండు గంటల పాటు ఇక్కడే ఉంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకోనున్నారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లు స్వాగతం పలకనున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి 12.15 గంటల మహ్య సికింద్రాబాద్ రైల్వే పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
తర్వాత 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు. ఒంటి గంటల 20 నిమిషాల వరక పరేడ్ గ్రౌండ్స్ లో వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణాలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచే శంకుస్థాపన చేస్తారు. వాటి నమూనాలను అక్కడే పరిశీలించనున్న ప్రధాని13 ఎంఎంటీఎస్ రైలు సేవలను కూడా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి బేగంపేట నుంచి బయలుదేరి వెళతారు. దాదాపు రెండు గంటల సేపు హైదరాబాద్‌లోనే ప్రధాని ఉంటుండటంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.