మెట్రో ఎక్స్‌ప్రెస్ వే కు నేడు శంకుస్థాపన

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు

Update: 2022-12-09 02:21 GMT

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాన్ని విస్తరించనున్నారు. మైండ్ స్పేస్ వద్ద ఈరోజు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకూ ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది.

6,250 కోట్ల ఖర్చుతో...
ఇందుకోసం 6,250 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. మొత్తం 31 కిలోమీటర్ల మేరకు ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని నిర్ణయించారు. మైండ్‌స్పేస్ వద్ద శంకుస్థాపన చేసిన అనంతరం కేసీఆర్ అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో ఉదయం పది గంటలకు ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News