జాతీయ రహదారిపై నిలచిన వాహనాలు

దసరా సెలవులు పూర్తి కావడంతో జాతీయ రహదారిపై వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి.

Update: 2024-10-13 12:24 GMT

దసరా సెలవులు పూర్తి కావడంతో జాతీయ రహదారిపై వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. రేపటి నుంచి మళ్లీ కార్యాలయాలు ప్రారంభం అవుతుండటంతో అందరూ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కువ సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సొంత వాహనాలలో బయలుదేరడంతో ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్లపైకి వచ్చాయి.

దసరా సెలవులు పూర్తి కావడంతో...
దీంతో టోల్ గేట్లను దాటేందుకు ఎక్కువ సమయం పడుతుంది. టోల్ ఫీజు ఫాస్టాగ్ పద్ధతిలో చాలా వరకూ వాహనాలు చెల్లిస్తున్నప్పటికీ నిదానంగా వాహనాలు వెళుతున్నాయి. టోల్‌గేట్ల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు హైదరాబాద్ వచ్చే మార్గంలో ఎక్కువ గేట్లను టోల్ గేట్ల సిబ్బంది తెరచి ఉంచారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. రేపు ఉదయం వరకూ వాహనాల రద్దీ ఇలాగే కొనసాగుతుందని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు. దసరా సెలవులు పూర్తయి అందరూ హైదరాబాద్ కు చేరుకుంటున్న తరుణంలోనే పలు చోట్ల హోటళ్లకు కూడా గిరాకీ పెరిగింది.


Tags:    

Similar News