Ayodhya: ఈ బడ్జెట్‌లో అయోధ్యకు భారీగా నిధులు కేటాయించనున్నారా?

యూపీలోని అయోధ్యలో రామమందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం

Update: 2024-01-24 06:44 GMT

Budget 2024

యూపీలోని అయోధ్యలో రామమందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి ప్రధాన మోడీ చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇక ఆలయం ప్రారంభోత్సవం జరిగిపోయింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ కూడా రాబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. అయితే బడ్జెట్‌ ప్రభావం అయోధ్యపై ఉంటుందా అన్నది చర్చ జరుగుతోంది. నిర్మలా సీతారామన్ అయోధ్యకు ఎన్నో బహుమతులు ఇచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

దాదాపు 3.5 లక్షల జనాభా ఉన్న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత పర్యాటకుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో అయోధ్య భారీగానే అభివృద్ధి జరుగనుంది. దీంతో నిర్మలమ్మ ఈ బడ్జెట్‌లో అయోధ్యకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని కూడా ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. రామమందిర నిర్మాణమే కాకుండా 250కి పైగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో అయోధ్యకు కొన్ని విభిన్న ప్రకటనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అయోధ్యకు కొత్త రైలును ప్రకటన

ప్రభుత్వాలు సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లలో కొత్త, పెద్ద ప్రకటనలు చేయనప్పటికీ, గత కొన్ని మధ్యంతర బడ్జెట్‌లలో ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ అయోధ్యకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే బడ్జెట్ ఇప్పుడు ప్రధాన బడ్జెట్‌లో భాగం. కాబట్టి నిర్మలా సీతారామన్ అయోధ్యకు కొత్త రైలును కూడా ప్రకటించాలని భావిస్తున్నారు.

అంతేకాకుండా, దేశంలోని తీర్థయాత్ర రంగాల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళికను ప్రారంభించింది. మోదీ ప్రభుత్వ ‘అమృత్ యోజన’ పట్టణ పునరుద్ధరణకు కూడా కృషి చేస్తోంది. అటువంటి పరిస్థితిలో, నిర్మల ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా అయోధ్య కోసం పెద్ద ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 2031 నాటికి అయోధ్యలో రూ.85,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, అయోధ్య క్లీనింగ్, రోడ్ల విస్తరణ, థీమ్ పార్కులు, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కేంద్రం.

Tags:    

Similar News