Union Budget : ఆదాయపన్ను యధాతధం.. ఎలాంటి మార్పులేదు
ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎగుమతి, దిగుమతి సుంకాలలో కూడా ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల రూపాయల వరకూ ఎలాంటి పన్ను లేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
వసూళ్లు పెరిగాయని...
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్టు పెరిగాయన్న ఆర్థికమంత్రి పన్ను చెల్లింపుదారుల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ ను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 47.66 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. పదేళ్ల లో ఏం చేశామన్న విషయాలను చెప్పిన సీతారామన్, ఏం చేయబోతుంది మాత్రం చెప్పలేదు.