Andhra Pradesh Budget : వ్యవసాయశాఖ బడ్జెట్ లో కేటాయింపులివే

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయశాఖకు సంబంధించిన బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు

Update: 2024-11-11 06:45 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయశాఖకు సంబంధించిన బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయశాఖకు సంబంధంచి 43,402 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వం రైతుల పంటలకు బీమా అందించలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. అదే సమయంలో తమ ప్రభుత్వం భూసార పరీక్షలకు, వడ్డీలేని రుణాలను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే తుపానులు, వరదల వల్ల నష్టపోయిన రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

కేటాయింపులివే...
విత్తనాల రాయితీల కోసం 240 కోట్లు, భూసార పరీక్షలకు 38.88 కోట్లు, విత్తనాల పంపిణీకి 240 కోట్లు, ఎరువుల సరఫరాకు 40 కోట్లు, పొలం పిలుస్తుంది కార్యక్రమానికి 11.31 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 422.96 కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి 44.77కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 187.68 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వడ్డీలేని రుణాలకు 628 కోట్లు, అన్నదాత సుఖీభవకు 4,500 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతు సేవా కేంద్రాలకు 26.92 కోట్లు, పంటల బీమాకు 1,023 కోట్లు, వ్యవసాయశాఖకు 8,564 కోట్లు, ఉద్యానవనశాఖకు 3469 కోట్లు, పట్టు పరిశ్రమకు 108 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ కు 314 కోట్లు, సహకార శాఖకు 308 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వ్యవసాయశాఖమంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


Tags:    

Similar News