నాలుగు రంగాలకు....
కుల, మత బేధాలు లేకుండా అందరికీ అవకాశాలను కల్పిస్తన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2047 నాటికి ఆర్థిక అసమానత, పేదరికం లేకుండా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలపారు. పేదరిక నిర్మూలనకు బహుముఖ విధానాలతో పనిచేసిందన్నారు. నాలుగు రంగాలకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలను అందించామని తెలిపారు. జన్‌ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్ల రూపాయలను అందించామని చెప్పారు. 2.20 లక్షల కోట్ల రూపాయలను పూచీకత్తు లేని రుణంగా అందచేశామని చెప్పారు.
పారిశ్రామిక రంగంలో...
వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతను విలువను జోడించే విధానాలను తెచ్చామని చెప్పారు. స్కిల్ ఇండియా పేరుతో కోటి నలభై లక్షల మంది యువతకు నైపుణ్యలో శిక్షణ ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ముద్ర యోజన పధకం ద్వారా 30 కోట్ల మందికి రుణాలను అందించామన్నారు. కొత్తగా 16 ఐఐఐటీలు, ఏడు ఐఎంఎలు ప్రారంభించుకున్నామని చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరిగేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. జీఎస్‌టీ, పన్నుల పరిధిలో చేపట్టిన సంస్కరణలు దాని పరిధిని పెంచాయని చెప్పారు. జీడీపీకి ఈ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆశావర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లకు విస్తరించామని తెలిపారు. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామన్న ఆర్థిక మంత్రి పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామని చెప్పారు.
మధ్యతరగతి కోసం...
మధ్యతరగతి కోసం నూతన గృహ నిర్మాణం విధానాన్ని తెస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పారు. కొత్త ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతిస్తుందన్నారు. పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం యాభై శాతం పెరిగిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచిందని తెలిపారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తామని నిర్మలమ్మ తెలిపారు. రానున్న ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. లక్ పతీ దీదీ లక్ష్యాన్ని రెండు నుంచి మూడు కోట్లకు పెంచుతున్నామని తెలిపారు.