టర్కీలో కొనసాగుతోన్న భూ ప్రకంపనలు.. ఇప్పటివరకూ 100కి పైగా
భారీ భూకంపం తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్ లో మరికొంతకాలం
టర్కీలో నిన్నటి నుండీ భూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 100 సార్లకు పైగా భూ ప్రకంపనలు వచ్చాయి. నిన్న తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన తర్వాత.. వరుసగా ప్రకంపనలు వస్తూనే ఉన్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 అంతకంటే ఎక్కువగా నమోదైనట్లు తెలిపింది.
భారీ భూకంపం తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్ లో మరికొంతకాలం పాటు 5 నుండి 6 తీవ్రతతో భూ ప్రకంపనలు రావొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ భూకంపాల ప్రభావంతో.. ఇప్పటికే దెబ్బతిన్న భవనాలు కూలవచ్చని తెలిపారు. దీంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తొలుత వచ్చిన భారీ భూకంప ధాటికి అనేక ప్రాంతాల్లో భవనాలు శిథిలమయ్యాయి. ఇప్పటివరకూ టర్కీ, సిరియాల్లో 4500 పైగా మృతదేహాలను శిథిలాల కింది నుండి వెలికితీశారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపాల కారణంగా అనేక మంది నిరాశ్రయులవుతున్నారు.