Earth Quake : అమెరికాలో భారీ భూకంపం
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 7 గా నమోదయింది
అమెరికాలో భూకంపం సంభవించింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భూమి కంపించింది. భూరరీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. రిక్టర్ స్కేల్ పై 7 గా నమోదయింది. కాలిఫోర్నియా ఉత్తర తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిందని అమెరికా భూ సర్వేక్షణ విభాగం తెిపింది. దీంతో సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
రిక్టర్ స్కేల్ పై...
భూకంపం ప్రభావంతో అమెరికాలోని పెట్రోలియా, స్కాటియా, కాబ్ వంటి ప్రాంతాల్లో భూమి భారీగా కంపించినట్లు అధికారుల తెలిపారు. అయితే ఎంత మేరకు ప్రాణనష్టం సంభవించింది? ఏ మేరకు ఆస్తి నష్టం సంభవించింది అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. భూకంప తీవ్రత 7గా ఉండటంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు.