పంజాబీ గ్యాంగ్ స్టర్ హత్య
అనంతరం అమర్ ప్రీత్ పై కాల్పులు జరిపారు. అతని వాహనానికి నిప్పు పెట్టి పరారయ్యారు. ఇదంతా జరుగుతున్న సమయంలో..
పంజాబ్ కు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఏ పెళ్లివేడుకలో పాల్గొన్న అతనిపై.. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే దాడి జరిగింది. కెనడా టాప్ 10 గ్యాంగ్ స్టర్లలో అతనూ ఒకడు. అతని పేరు అమర్ ప్రీత్ సమ్రా అలియాస్ చిక్కీ. అతడి ప్రత్యర్థి గ్యాంగ్ అయిన బ్రదర్స్ గ్రూప్ సభ్యులు పట్టపగలే చిక్కీని హత్య చేశారు. ఈ ఘటన వాంకోవర్ నగరంలో చోటుచేసుకుంది. ఫ్రెష్ వ్యూ హాల్ లో జరిగిన పెళ్లి వేడుకలో అమర్ ప్రీత్ తన సోదరుడైన రవీందర్ తో కలిసి పాల్గొన్నాడు.
వేడుకలో కొద్దిసేపు డ్యాన్స్ చేసి.. రిలాక్స్ అయ్యేందుకు కూర్చున్నాడు. ఇంతలో ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు అక్కడికి చేరుకుని మ్యూజిక్ ఆపాలంటూ అరిచారు. అనంతరం అమర్ ప్రీత్ పై కాల్పులు జరిపారు. అతని వాహనానికి నిప్పు పెట్టి పరారయ్యారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఫంక్షన్ హాల్ లో సుమారు 60 మంది అతిథులు ఉన్నారు. గాయాలతో ఉన్న అమర్ ను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు. అమర్ ను చంపేందుకు ఆ ఫంక్షన్ హాల్ లో ముందునుండీ రెక్కీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెనడాలో గ్యాంగ్ లతో హింసలకు పాల్పడుతున్న 11 మందిలో 9 మంది పంజాబీ వాసులే ఉన్నారు. అమర్ ప్రీత్ సోదరుడు రవీందర్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు.