టర్కీ భూకంపాలు.. 500 దాటిన మృతుల సంఖ్య
ఈ భారీ భూకంపాల ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో..
టర్కీ, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. ఈ భారీ భూకంపాల ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. ఆ తర్వాత సిరియా వచ్చిన భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపాల తీవ్రతకు భవనాలు నేలమట్టమవగా..చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
ఇప్పుడు రెండు దేశాల్లో మృతుల సంఖ్య 500 దాటిందని అధికారులు వెల్లడించారు. సిరియాలో 245 మంది మృతి చెందగా.. కొందరు గాయాలపాలయ్యారు. టర్కీలో మృతుల సంఖ్య 284కి చేరింది. మొత్తంగా మృతుల సంఖ్య 529కు చేరింది. టర్కీలో 2300 మందికి పైగా గాయపడినట్లు టర్కీ ఉపాధ్యక్షుడు ఓక్టే వెల్లడించారు. ఇంకా భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.